చదువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

ABN , First Publish Date - 2021-07-30T05:52:35+05:30 IST

విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్నారని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథక లబ్ధిదారులకు సాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో ఈ పథకం కింద మొదటి విడతలో 79,844 మంది లబ్ధిపొందారన్నారు. ఈ ఏడాది 80,509 మంది విద్యార్థులు ప్రస్తుతం లబ్ధిపొందుతున్నారని తెలిపారు.

చదువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు
జగనన్న విద్యాదీవెన చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 29: విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్నారని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథక లబ్ధిదారులకు సాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో  ఈ పథకం కింద మొదటి విడతలో 79,844 మంది లబ్ధిపొందారన్నారు. ఈ ఏడాది 80,509 మంది విద్యార్థులు ప్రస్తుతం లబ్ధిపొందుతున్నారని తెలిపారు. వారి తల్లుల ఖాతాలకు రూ.54.01 కోట్ల నగదును నేరుగా జమచేస్తారని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి విడతల వారీగా నగదు విడుదల కానుందన్నారు. ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం లేకుండా ప్రభుత్వమే భర్తిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లులకు కలెక్టర్‌, ఎమ్మెల్సీ పోతుల సునీతలు చెక్కును అందజేశారు. జేసీ కృష్ణవేణి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T05:52:35+05:30 IST