‘ఏకగ్రీవాలకు’ ఏదీ నజరానా..? ఎమ్మెల్యే నిధుల జాడలేదు

ABN , First Publish Date - 2020-08-10T17:22:04+05:30 IST

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు అం దని ద్రాక్షగానే మిగిలాయి. ప్రోత్సాహక నిధులతో అభి వృద్ధి పనులు చేపట్టవచ్చనే ఉద్దేశంతో జిల్లాలోని పలు పంచాయ తీల పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

‘ఏకగ్రీవాలకు’ ఏదీ నజరానా..? ఎమ్మెల్యే నిధుల జాడలేదు

ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహక నిధులు రూ 4.10 కోట్లు


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు అం దని ద్రాక్షగానే మిగిలాయి. ప్రోత్సాహక నిధులతో అభి వృద్ధి పనులు చేపట్టవచ్చనే ఉద్దేశంతో జిల్లాలోని పలు పంచాయ తీల పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  దాదా పు 18 నెలలు గడిచినా నిధుల కోసం పాలక వర్గాలు ఎదురు చూడక తప్పడం లేదు. పల్లెప్రగతికి వస్తున్న ఆర్థిక సంఘం నిధులతోనే ఊరట చెందుతున్నారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 211 గ్రామ పంచాయతీ లు ఉండగా కొత్తగా 61  పంచాయతీలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో సిరిసిల్ల, వేముల వాడ మున్సిపాలిటీల్లో 12 గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. జిల్లా లో 255 గ్రామ పంచా యతీలు మిగిలాయి. ఇందులో 253  పంచా యతీలకు గతేడాది మూడు విడతలుగా ఎ న్నికలు జరిగాయి. ఇం దులో 41 గ్రామపంచా యతీలు ఏకగ్రీవమ య్యాయి.  ఏకగ్రీవ పంచాయతీలకు  ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇంతవరకు విడుదల చేయలేదు. జిల్లాలో 41 పంచాయతీలకు ప్రోత్సాహ ని ధులు రూ.4.10 కోట్లు రావాల్సి ఉంది. దీనికి తోడు సిరి సిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవాలు చేసుకునే గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయిస్తానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. నియో జకవర్గ నిధులు రాకపోవడంతో వాటిజాడ కూడా లేకుం డా పోయింది. ప్రస్తుతం పల్లెప్రగతికి వచ్చే నిధులతో అరకొరగా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మరోవైపు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ కూడా భారంగా మారింది. 


జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలు..

సిరిసిల్ల జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీల్ల్లో బోయినపల్లి మండలంలో కోరెం, చందుర్తి మండలం దేవునితండా, కట్టలింగంపేట, కొత్తపేట, ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె, గుండెపల్లి, కిష్టారావుపల్లి, పెద్దలింగాపూర్‌, రామోజీపేట, సోమారంపేట, గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్‌, రాజుపేట, పొన్నాలపల్లి, కోనరావుపేట మండలం అజ్మీర తండా, గోవిందరావుపేట తండా, జై సే వాలాల్‌ భూక్య తండా, జై సే వాలాల్‌ ఊరు తండా, కమ్మరిపేట తండా, ముస్తాబాద్‌ మండలం గన్నవానిపల్లె, రుద్రంగి మండలం అడ్డబోరు తండా, బడి తండా, చింతమాని తండా, డేగావత్‌ తం డా, రూపులానాయక్‌ తండా, సర్పంచ్‌ తండా, వీరుని తండా, తంగళ్లపల్లి మండలం చింతల్‌ఠాణా, నర్సింహులపల్లె, వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండా బాబాయి చెరువు తండా, భూక్య తండా, లాల్‌ సింగ్‌ తండా, శాంతినగర్‌, ఎర్రగడ్డతండా, వేములవాడ రూరల్‌ మండలం తుర్కాశినగర్‌, ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర్‌ తండా, గుంటపల్లి చెరువు తండా, దేవుని గుట్ట తండా, అగ్రహారం, హరిదాస్‌నగర్‌ గ్రామ పంచాయతీలు పూర్తి పాలకవర్గంతో సహా ఏకగ్రీవమై ప్రోత్సాహానికి అర్హతగా నిలిచాయి. 

Updated Date - 2020-08-10T17:22:04+05:30 IST