ఆ ఐల్యాండ్‌లో ముగ్గురే చిన్నారులు... కారణమిదే!

ABN , First Publish Date - 2021-04-01T11:52:24+05:30 IST

పలు దేశాల్లో జనాభా పెరుగుదల ఒక సమస్యగా ఉండగా...

ఆ ఐల్యాండ్‌లో ముగ్గురే చిన్నారులు... కారణమిదే!

న్యూఢిల్లీ: పలు దేశాల్లో జనాభా పెరుగుదల ఒక సమస్యగా ఉండగా, దక్షణ కొరియాలోని ఒక ద్వీపంలో కేవలం వందమంది మాత్రమే ఉండటానికితోడు ఇక్కడ కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే ఉన్నారు. మరోవైపు దక్షిణ కొరియాలో వృద్ధుల జనాభా పెరగడం, శిశు జననాలు గణనీయంగా తగ్గడం పెద్ద సమస్యగా పరిణమించింది. కాగా ఆ ద్వీపంలో ల్యూ చాన్, అతని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ల్యూ చాన్‌ను మీడియా పలుకరించినపుడు ఇక్కడ పిల్లలు మరింతమంది ఉంటే బాగుంటుందని, వారందరితో కలసి ఆడుకునే వాడినని అనిపిస్తుందన్నాడు. 


ఇక్కడ పిల్లలు లేకపోవడంతో 66 ఏళ్ల కిమ్ సీ యంగ్‌తో ఆడుకోవలసి వస్తున్నదన్నాడు. కాగా కొన్ని దశాబ్ధాలుగా దక్షిణకొరియాలో పట్టణీకరణ ముమ్మరంగా సాగుతోంది. దీంతో శివారు ప్రాంతాల్లో ఉండేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ కోవలోనే నోకోడ్ ద్వీపంలో కేవలం వందమంది మాత్రమే ఉంటున్నారు. ఈ ద్వీపంలో ఉన్న ఏకైక పాఠశాల కూడా దశాబ్దం క్రితమే మూతపడింది. దీంతో అక్కడున్న చిన్నారులు  ధార్మిక పాఠశాలలో చదువుకోవలసి వస్తోంది. కాగా ఈ ద్వీపం ఫిషింగ్ పరంగా ఎంతో ఆదరణ పొందింది. కిమ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశం అంటే చాలామందికి ఇష్టమని, అయితే ఇక్కడ జనాభా గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మాదిరిగానే ఇక్కడ కాలుష్యం లేదన్నారు. అయితే ఇక్కడి జనాభా ఒంటరితనంతో పోరాడాల్సి వస్తున్నదన్నారు.

Updated Date - 2021-04-01T11:52:24+05:30 IST