కేసీఆర్‌కు మద్దతుగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-10-18T04:45:47+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నుకోవాలని కోరుతూ ఆదివారం పలువురు ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు.

కేసీఆర్‌కు మద్దతుగా నామినేషన్లు
హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న ఎమ్మెల్యేలు

భూత్పూర్‌, అక్టోబరు 17 : టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నుకోవాలని కోరుతూ ఆదివారం పలువురు ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌లో వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు మద్దతుగా ప్రతిపాదిస్తూ నామినేషన్‌ను దాఖలు చేశారు. దేవరకద్ర నియోజవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పోన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ నియోజవర్గాల నుంచి దాదాపుగా 35 మంది ఎమ్మెల్యేలు హాజరై నామినేషన్‌కు ప్రతిపాదిస్తూ మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-18T04:45:47+05:30 IST