Advertisement
Advertisement
Abn logo
Advertisement

కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి

సివిల్‌ సర్వీస్‌ ర్యాంకర్‌ దివ్య

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం నవంబరు 30: విద్యార్థులు విద్యార్థి దశ నుంచే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లాకు చెందిన సివిల్‌ సర్వీస్‌ ర్యాంకర్‌ దివ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల పూర్వపు విద్యార్థి దివ్యను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మావతి, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్య మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందని, గొప్ప కళాశాలలో చదివామన్నది ముఖ్యం కాదని, విద్యార్థులు తాము అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ఇష్టపడి చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చన్నారు. విద్యార్థులు ఉన్న సమయాన్ని వృథా చేసుకోకుండా, విలువైన సమయాన్ని తాము ఎంచుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మావతి మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ కళాశాలలో చదివిన విద్యార్థి దివ్య సివిల్స్‌ ర్యాంకర్‌గా నిలువడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement