మీ మెసేజ్‌లు చదవం.. కాల్స్‌కూడా వినం

ABN , First Publish Date - 2021-01-13T07:26:45+05:30 IST

వాట్సాప్‌ ప్రైవసీ పాలసీని మార్చడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడం, పెద్దఎత్తున వినియోగదారులు ప్రత్యామ్నాయ యాప్‌లను వెతుక్కోవడంతో దిగ్గజ

మీ మెసేజ్‌లు చదవం.. కాల్స్‌కూడా వినం

ఫేస్‌బుక్‌కు నంబర్లు, లోకేషన్‌ షేర్‌ చేయట్లేదు

వ్యక్తి గోప్యతపై ప్రజలకు వాట్సాప్‌ వివరణ 

కొనసాగుతున్న ప్రత్యామ్నాయల జోరు!

టెలిగ్రామ్‌కు 2రోజుల్లో 22 లక్షల డౌన్‌లోడ్‌లు

సిగ్నల్‌కు కూడా లక్ష డౌన్‌లోడ్‌లు 

లింకులతో షిఫ్ట్‌ అవుతున్న వాట్సాప్‌ గ్రూప్‌లు


 న్యూఢిల్లీ, జనవరి 12: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీని మార్చడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడం, పెద్దఎత్తున వినియోగదారులు ప్రత్యామ్నాయ యాప్‌లను వెతుక్కోవడంతో దిగ్గజ సంస్థ ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చింది. వినియోగదారుల ఫోన్‌బుక్‌లో నంబర్లు, లొకేషన్‌, గ్రూపుల లాంటి సమాచారమేదీ మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో వాణిజ్య అవసరాల కోసం షేర్‌ చేసుకోవడం లేదని వాట్సాప్‌ తాజాగా బ్లాగ్‌పోస్టులో చెప్పిం ది. వ్యక్తుల మధ్య కాల్స్‌ను వినడం, మెసేజ్‌లను చదవడం లాంటి పనులను ఫేస్‌బుక్‌ కానీ, వాట్సాప్‌ కానీ చేయబోవని పేర్కొంది.


కేవలం వాట్సాప్‌ వినియోగదారులు నేరుగా వ్యాపార సంస్థలతో సంభాషించే అవకాశాన్ని కల్పించడానికే ప్రైవసీ పాలసీ మార్చామని వాట్సాప్‌ చెబుతోంది. ఫిబ్రవరి 8వ తేదీలోగా మారిన ప్రైవసీ పాలసీకి ఆమోదం తెలిపిన వారికే వాట్సాప్‌ సేవలు కొనసాగుతాయని ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దాంతో వ్యక్తి గోప్యతను సీరియ్‌సగా తీసుకొనే వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఎలాన్‌ మస్క్‌ సూచించిన సిగ్నల్‌ యాప్‌కు, ఇప్పటికే వాట్సా్‌పకు ప్రత్యామ్నాయంగా మారిన టెలిగ్రామ్‌కు పెద్ద సంఖ్యలో మారిపోతున్నారు.


తాజాగా రెండు రోజుల వ్యవధిలో టెలిగ్రామ్‌కు 22 లక్షల డౌన్‌లోడ్‌లు రాగా, సిగ్నల్‌కు లక్ష డౌన్‌లోడ్‌లు వచ్చాయి. ఇప్పటికే ఉన్న వాట్సాప్‌ గ్రూపులకు బదులుగా కొత్తగా సృష్టించిన సిగ్నల్‌ గ్రూపుల్లో చేరాల్సిందిగా గ్రూప్‌ ఆహ్వానాల లింక్‌లను ఏకంగా వాట్సా ప్‌ గ్రూప్‌లకే పంపుతున్నారు. దాంతో  క్షణాల్లో వాట్సా ప్‌ గ్రూపులు సిగ్నల్‌/టెలిగ్రామ్‌లోకి షిఫ్ట్‌ అయిపోతున్నాయి. 


Updated Date - 2021-01-13T07:26:45+05:30 IST