Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 13 2021 @ 11:58AM

Gujarat: కన్నీటిపర్యంతమైన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్

తాను కలత చెందలేదని వ్యాఖ్య

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో ముందు వరసలో ఉండి బెర్తు మిస్ అయిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సోమవారం ఉదయం కన్నీటి పర్యంతమయ్యారు. గుజరాత్ కాబోయే కొత్త సీఎం భూపేంద్రపటేల్ సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కలిశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు సోమవారం ఉదయం భూపేంద్ర పటేల్ తనను కలిసిన తర్వాత, నితిన్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ‘‘భూపేంద్ర పటేల్ నాకు పాత కుటుంబ స్నేహితుడు. నేను అతడిని అభినందించాను. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చూసి నేను సంతోషించాను.’’ అని నితిన్ పటేల్ చెప్పారు.

‘‘ నాకు సీఎం పదవి రాలేదని కలత చెందలేదు. నేను 18 సంవత్సరాల నుంచి బీజేపీలో పని చేస్తున్నాను, పని చేస్తూనే ఉంటాను. నాకు పార్టీలో స్థానం లభించినా, లేకపోయినా, నేను పార్టీలో సేవ చేస్తూనే ఉంటాను’’అని నితిన్ పటేల్ అన్నారు.భూపేంద్ర పటేల్‌ను కలిసిన తర్వాత నితిన్ పటేల్ కళ్లలో నీళ్లు వచ్చాయి. తన 30 సంవత్సరాల అసోసియేషన్‌లో బీజేపీ తనకు చాలా ఇచ్చిందని, ఎలాంటి బాధలు లేవని నితిన్ పేర్కొన్నారు.తాను ఎన్నో ఒడిదుడుకులు చూశానని, ప్రజల హృదయంలో తానున్నానని నితిన్ వివరించారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాక తాను అసంతృప్తితో ఉన్నానని వచ్చిన వార్తలు ఊహాగానాలని నితిన్ పటేల్ చెప్పారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement