అధ్వానంగా ఆలేరు– మంతపురి రోడ్డు

ABN , First Publish Date - 2021-07-29T07:05:04+05:30 IST

ఆలేరు – మంతపురి రోడ్డు అధ్వానంగా మారింది.

అధ్వానంగా ఆలేరు– మంతపురి రోడ్డు
ఆలేరు – మంతిపురి రోడ్డు దెబ్బతినడంతో వాహనదారుల ఆప్రమత్తత కోసం గుంతల్లో పాతిన ఎర్ర జెండాలు

ఆలేరు రూరల్‌:  ఆలేరు – మంతపురి రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డుపు భారీ గుంతలు ఏర్పడినా ఎవరూ పట్టిం చుకోవడంలేదు. దీంతో ఈరోడ్డులో అలేరుకు రాకపోకలు సాగించే మండలంలోని మంతపురి, శర్భణాపురం, మోట కొండూరు మండలంలోని దిలావర్‌పూర్‌, ఇక్కుర్తి, మాటూ రు తదితర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.  సంబం ధిత ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణం స్పందించి గుంతల మయంగా మారిన రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేయించాలని వాహనదారులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-07-29T07:05:04+05:30 IST