ఒకే ఉపిరితిత్తితో కరోనాను జయించిన నర్సు

ABN , First Publish Date - 2021-05-14T07:56:05+05:30 IST

కరోనా సోకినవాళ్లలో ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురైతే కొందరిలో అది ప్రాణాంతకం అవుతోంది. అయితే ఒకే ఊపిరితిత్తితో నెట్టుకొస్తున్న ఓ నర్సు, 14 రోజుల్లోనే కరోనాను జయించి....

ఒకే ఉపిరితిత్తితో కరోనాను జయించిన నర్సు

న్యూఢిల్లీ, మే 13: కరోనా సోకినవాళ్లలో ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురైతే కొందరిలో అది ప్రాణాంతకం అవుతోంది. అయితే ఒకే ఊపిరితిత్తితో నెట్టుకొస్తున్న ఓ నర్సు, 14 రోజుల్లోనే కరోనాను జయించి మళ్లీ విధుల్లో చేరారు. మఽధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫులిత్‌ పీటర్‌ (39) అనే నర్సు చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురైతే.. ఓ ఊపిరితిత్తిని తొలగించారు. ఈ విష యం ఆమెకు ఆరెళ్ల క్రితం దాకా తెలియదు. తికంఘడ్‌లోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ప్రఫులిత్‌కు ఇటీవల పాజిటివ్‌ వచ్చింది. ఒకే ఊపిరితిత్తితో ఉన్న ఆమె, కోలుకుంటుందా? అని ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారు. అయితే హోం ఐ సొలేషన్‌లో ఉంటూనే క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం, శ్వాసకు సంబందించిన వ్యాయమా లు చేశానని ప్రఫులిత్‌ చెప్పారు. 

Updated Date - 2021-05-14T07:56:05+05:30 IST