Abn logo
Oct 23 2021 @ 21:56PM

న్యాయవిజ్ఞాన సదస్సు

మాట్లాడుతున్న ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య

గూడూరు, అక్టోబరు 23: స్థానిక నిమ్మ మార్కెట్‌లో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య మాట్లాడుతూ ప్రతిఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహిస్తోందన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయపరమైన సేవలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి గాయత్రి, న్యాయవాదులు హరనాథ్‌ప్రసాద్‌రావు, అరవపార్వతయ్య, నిమ్మవ్యాపారులు సిద్దారెడ్డి, పెంచలయ్య, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.