కంది పంట పరిశీలన

ABN , First Publish Date - 2022-01-25T04:38:18+05:30 IST

మండలంలోని పలు గ్రామాలలో సోమవారం కందిపంటను శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు.

కంది పంట పరిశీలన
బి.పేటలో కందిని పరిశీలిస్తున్న అధికారులు

రాచర్ల, జనవరి 24 : మండలంలోని పలు గ్రామాలలో సోమవారం కందిపంటను శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం దర్శి శాస్త్రవేత్తలు దుర్గాప్రసాద్‌, భారతి కంది సాగు చేసే రైతులకు పలు సూచనలు చేశారు. మండలంలో దాదాపు 2వేల ఎకరాల కం ది పంటను సాగు చేయడం జరిగిందని, నవంబరు, డిసెంబరులో కురిసిన అధిక వర్షాలకు పూత రాలిపోయిందని శాస్త్రవేత్తలకు రైతులు వివరించారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ కందికి స్టెరిడిటీ మొజాయిక్‌ డిసీస్‌ అనే వెర్రితెగులు ఉందని, అకాల వర్షాలకు పిందె రాలిందని రైతులకు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని తెలిపారు.  కా ర్యక్రమంలో  ఏవో షేక్‌ మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.  

దెబ్బతిన్న కంది

బేస్తవారపేట : బేస్తవారపేట మండలంలోని ఒందుట్ల గ్రామంలో దెబ్బతిన్న కంది పంటను శాస్త్రవేత్తలు భారతి, దుర్గాప్రసాద్‌ సోమవారం పరిశీలించారు. అనంతరం సాగు చేసిన రైతులతో మాట్లాడారు.  కంది పూతదశలోనే పూర్తిగా రాలిపోయిందన్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు కంది పంట రాలేదని, దీంతో  పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి మెర్సీ, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T04:38:18+05:30 IST