కొత్త ఏడాది వేడుకలు నిషేధం.. చర్చిలలో 50 మందికి అనుమతి

ABN , First Publish Date - 2021-12-25T00:10:08+05:30 IST

కొత్త ఏడాది వేడుకలు నిషేధం.. చర్చిలలో 50 మందికి అనుమతి

కొత్త ఏడాది వేడుకలు నిషేధం.. చర్చిలలో 50 మందికి అనుమతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో మళ్లీ కరోనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ నుంచి ముప్పును కట్టడి చేసేందుకు ఒడిశా సర్కారు శుక్రవారం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. న్యూఇయర్ రాత్రి వేడుకలు నిషేధించబడ్డాయని, క్రిస్మస్ సందర్భంగా చర్చిలలో 50 మందికి అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు వివాహాలు మినహా ఇతర వేడుకలకు అనుమతి లేదని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక సమావేశాలు, ర్యాలీలు, ఆర్కెస్ట్రాలు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు మొదలైన వాటిలో వేడుకలు కూడా నిషేధించబడ్డాయని ఒడిశా సర్కారు వెల్లడించింది.

Updated Date - 2021-12-25T00:10:08+05:30 IST