ఆలీవ్‌ బార్‌ మూసివేత

ABN , First Publish Date - 2020-10-30T10:10:12+05:30 IST

జూబ్లీహిల్స్‌లో నిర్వహిస్తున్న ఆలివ్‌ బార్‌ను సీజ్‌ చేస్తామని పర్యాటకశాఖ జారీచేసిన హెచ్చరికలపై బార్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ..

ఆలీవ్‌ బార్‌ మూసివేత

నోటీసులపై స్టేట్‌సకో పాటించండి

మూడు రోజుల్లోగా రూ. 25 వేలు చెల్లించండి 

బార్‌ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం 


హైదరాబాద్‌  అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో నిర్వహిస్తున్న ఆలివ్‌ బార్‌ను సీజ్‌ చేస్తామని పర్యాటకశాఖ జారీచేసిన హెచ్చరికలపై బార్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ పి. నవీన్‌రావు స్టేట్‌సకో ఆదేశాలు జారీచేశారు. పిటిషనర్‌ సంస్థ మూడు రోజుల్లోగా రూ.25 లక్షలు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ వ్యాజ్యాన్ని ఎందుకు విచారణకు స్వీకరించకూడదో చెప్పాలని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శికి, టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు, కోనాస్‌ ఫుడ్‌కోర్టుకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణను నవంబర్‌ 9వ తేదీకి వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ సమయంలో కోనాస్‌ ఫుడ్‌కోర్టు ఆన్‌ది రాక్స్‌ సంస్థ లైసెన్స్‌ ఫీజు చెల్లించలేదనే కారణంతో ఆలీవ్‌బార్‌ అండ్‌ కిచెన్‌ను సీజ్‌చేస్తామని టూరిజం కార్పొరేషన్‌ హెచ్చరించింది. దీనిపై బార్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.


మార్చి 2020 నుంచి సెప్టెంబర్‌ 2020 మధ్యకాలానికి కోనాస్‌ ఫుడ్‌కోర్టు లైసెన్స్‌ ఫీజులు కట్టలేదనే కారణంతో ఆలీవ్‌ బార్‌ను మూసివేయాలని టూరిజం కార్పొరేషన్‌ చెప్పడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని కోర్టుకు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు, ఎత్తివేసిన తర్వాత కూడా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. మొత్తం బకాయిలు రూ. 45 లక్షలకు పైగా ఉన్నట్లు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు రూ. 25 లక్షలు మూడు రోజుల్లో చెల్లించాలని ఆలీవ్‌బార్‌ అండ్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ను ఆదేశించించారు. ఇరు పక్షాలు స్టేట్‌సకో పాటించాలని స్పష్టం చేశారు.  

Updated Date - 2020-10-30T10:10:12+05:30 IST