Abn logo
Oct 15 2021 @ 00:38AM

‘తాగునీటి సమస్యను పరిష్కరిస్తా’

గుండాల, అక్టోబరు 14: ఆలేరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి అయిలయ్య అన్నారు. మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో బీర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు అండెం సంజీవ రెడ్డితో కలిసి వాటర్‌ ప్లాంట్‌ను ఐలయ్య ప్రారంభించి మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా తాగు నీటి సమస్య ఉందని తన దృష్టికి తెస్తే వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాన న్నారు. ఈ కార్యక్ర మంలో బీర్ల ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు ఈరసరపు యాదగిరిగౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ లింగాల భిక్షం, ఎంపీటీసీ కొర్న నరేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు గూడ మధుసూధన్‌గౌడ్‌, నాయకులు ఆకుల ఆంజనేయులు, శ్రీనివాస్‌, ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

లిం