Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణలో ఓమైక్రాన్ టెన్షన్

హైదరాబాద్: రాష్ట్రంలో ఓమైక్రాన్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 10 మందికిపైగా పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళ రిపోర్టు శుక్రవారం రానున్న క్రమంలో టెన్షన్ నెలకొంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరినీ సర్వేలెన్స్‌లో పెట్టారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.


మరోవైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఒమైక్రాన్‌ కలకలం రేపుతోంది. విదేశీ ప్రయాణికులకు నిబంధనలు కఠినం చేయడంతో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. దీంతో టిమ్స్‌కు కరోనా బాధితులు భారీగా చేరుకుంటున్నారు. అనుమానితుల శాంపిల్స్‌‌ను వైద్యులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌‌కు పంపుతున్నారు. టిమ్స్‌ వైద్యులు అందరికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. 


సూర్యాపేట జిల్లాలో డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. డీఎంహెచ్‌వో కుమారుడు ఇటీవల జర్మనీ నుంచి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారని అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement