యువతపై.. కరోనా పంజా!

ABN , First Publish Date - 2021-04-19T04:10:08+05:30 IST

సెకండ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో యువత అఽత్యధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ ప్రారంభంలో యువ తపై అంతంత మాత్రంగానే కరోనా వైరస్‌ ప్రభావం ఉండడం, ఒకవేళ వైరస్‌ బారి న పడ్డా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి.

యువతపై.. కరోనా పంజా!

మొదటి దశలో అంతంత మాత్రమే   
సెకండ్‌వేవ్‌లో భారీగా వైరస్‌ బారిన పడుతున్న యువత
యువతలోనూ మృతుల సంఖ్య రెట్టింపు అవుతున్న పరిస్థితి
జిల్లాలో ఇప్పటికే పలువురు వైరస్‌బారిన పడి మరణించిన వైనం
జిల్లా కేంద్రంలో పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య
పాక్షిక లాక్‌డౌన్‌ దిశగా వ్యాపార, రాజకీయ నాయకుల ఆలోచన
కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 18: సెకండ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో యువత అఽత్యధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ ప్రారంభంలో యువ తపై అంతంత మాత్రంగానే కరోనా వైరస్‌ ప్రభావం ఉండడం, ఒకవేళ వైరస్‌ బారి న పడ్డా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వైరస్‌ బారిన పడిన వారిలో యువకులు సైతం ఎక్కువగానే ఉంటుండగా కొందరు చికిత్స జరుగుతున్న  సమయంలోనూ  తుదిశ్వాస విడుస్తుండడంతో వైద్యులు సైతం సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ ప్రభావ ంపై ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. మొదటి దశలో కరోనా బారిన పడిన వారు కోలుకోవడం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మాత్రమే చనిపోతున్నారనే భావన అందరిలో నూ ఏర్పడడంతో అసలు మాస్క్‌ ధరించకపోవడం, వచ్చినా తమకు ఏమి కాదని విచ్చలవిడిగా పార్టీలు చేసుకోవడం, మాస్క్‌లు ధరించకుండానే స్నేహితు లతో షికారులు, దూరప్రయాణాలు చేయడం తది తర కారణాల వల్ల కొవిడ్‌ బారిన పడుతూ పరీక్షల నిమిత్తం, చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారని పేర్కొంటున్నారు. ఏదిఎమైనా ప్రస్తు త వైరస్‌ ప్రభావం ప్రమాదకరంగా ఉందని యువ కులు ఏవైన లక్ష ణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని, మాస్క్‌లు తప్పనిసరిగా వినియో గించాలని సూచిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సంభవించిన మరణాలలో యువకులు సైతం ఎక్కువగానే ఉన్నారని తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తమకేమీ కాదనే నిర్లక్ష్యమే.. అంపశయ్యపైకి చేర్చుతుంది
సాధారణంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పోలిస్తే యువతలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండడం సహజం. ఈ భావనతోనో యువతీ, యువకులు వైరస్‌ ప్రభావాన్ని అసలు పట్టించుకోకుండా కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారితోనూ సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుస్తోంది. ఇదే ఎక్కువ మంది వైరస్‌ బారిన పడేందుకు కారణమ వుతోంది. అలాగే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడిన చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదు. పది మందిలో ఒకరిద్దరికి మాత్రమే లక్షణాలు ఉంటుం డగా, మిగిలిన వారిలో ఎటువంటి లక్షణాలు కనిపిం చడం లేదు. దీనివల్ల వైరస్‌ సోకినా వారికి తెలియక పోవడం వల్ల రోజువారి కార్యకలాపాలు కొనసాగిస్తు న్నారు. దీనివల్ల వారి నుంచి మరింత మందికి వైర స్‌ వ్యాప్తి చెందుతోంది. ఇదిలా ఉంటే కొందరు వైర్‌ స బారిన పడినా తమకేమి కాదని సొంత వైద్యానికి ప్రాధాన్యతను ఇవ్వడం దగ్గు, జ్వరం రాగానే అందు కు సంబంధించిన మందులు వేసుకుంటూ తమకే మీ కాదనే నిర్లక్ష్యం వల్ల అంపశయ్యపైకి చేరుకుం టున్నారు.
జిల్లా కేంద్రంలో పెరుగుతున్న కేసులు, మరణాలు
జిల్లా కేంద్రంలో రోజురోజుకూ కేసుల సంఖ్య అత్యధికంగానే ఉంటుంది. నిత్యం 800లకు పైగానే కేసులు నమోదవుతుండడం అందులో 150 నుంచి 250 వరకు జిల్లా కేంద్రంలోనే నమోదు కావడం గమనార్హం. జిల్లా కేంద్రంలో వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరగడం, నిత్యావసర వస్తువులు, ఇతర పనుల నిమిత్తం ఇతర రాష్ర్టాలు, జిల్లాలు, మండ లాల నుంచి అత్యధికంగా జనసంచారం ఉండడంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని సమాచారం. రోజు ఏదో ఒక్క కాలనీలో మరణాలు సంభవిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనైతే రోజుకు కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు మరణిస్తు న్నట్లు తెలుస్తోంది. రాజీవ్‌నగర్‌, దేవునిపల్లి, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పరీక్షల నిమిత్తం వస్తున్న వారి లో సగం మంది జిల్లా కేంద్రానికి చెందిన వారే ఉం డడం గమనార్హం. గత వారం రోజుల నుంచి దాదాపు 30 మంది వరకు మరణించగా అందులో జిల్లా కేంద్రానికి చెందినవారే 5 నుంచి 10 మంది వరకు ఉన్నారంటే వైరస్‌ ఏ విధంగా దాడి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ వారం రోజుల వ్యవధి లోనూ యువకులు సైతం అత్యధికంగా మరణిస్తు న్నారు.
పాక్షిక లాక్‌డౌన్‌ వైపు వ్యాపార, రాజకీయ నాయకుల ఆలోచన
ప్రస్తుతం కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో పాకిక్ష లాక్‌డౌన్‌వైపు వ్యాపార, రాజకీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే గాంధారి, బీర్కూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిర్ణీత సమయంతో కూడిన పాక్షిక లాక్‌డౌన్‌ను విధించగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ వ్యాపార, రాజకీయ నాయకులు సోమవారం సమావేశమై వ్యాపార వర్గాలతో చర్చిం చి నిర్ణీత సమయంతో పాక్షిక లాక్‌డౌన్‌ విధించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తేనే జిల్లా కేంద్రంలో రద్దీ తగ్గుతుందని కొద్దిగా నైన వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆలోచన చేస్తు న్నట్లు తెలుస్తోంది.
పాజిటివ్‌ వచ్చిన వారు బయటకు రాకుండా కట్టడి చేస్తేనే ప్రయోజనం
మొదటిదశలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిపై నిరంతరం వైద్య సిబ్బంది నిఘా ఉండడంతో పాటు వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీసేవారు. వారి ఇంటి పరిసరాలలో బ్లీచింగ్‌ చల్లించడం, నిత్యం వారికి అందిస్తున్న మందులను పట్టికరూపంలో ఏర్పాటు చేసిన పోస్టర్‌లో నమోదు చేస్తూ ఉండడంతో కరోనా నుంచి కోలుకునే వరకు ఆ ఇంటి పరిసర ప్రాంతా లకు ఎవరు రాకుండా ఉండేవారు. చుట్టు పక్కల వారు, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం వారిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే వారు. కానీ ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే ఆసుపత్రుల నుంచి మందు లు తీసుకుని రావడం రెండు, మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైరస్‌ ప్రభావం తగ్గకున్నా విచ్చలవిడిగా సంచరిస్తున్నా ఎవరూ పట్టించుకోకపో వడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఇతరులకు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నట్లు సమాచారం. గతంలో వ్యాక్సినేషన్‌ లేకపోవడంతో పరీక్షలు నిర్వ హించి బాధితుని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్‌ చేసి వైరస్‌ వ్యాప్తిని వైద్యసిబ్బంది కట్టడి చేసే వారు. కానీ ప్రస్తుతం వైద్యసిబ్బంది ఒకవైపు వ్యాక్సి నేషన్‌, మరోవైపు పరీక్షలతో బిజీగా మారడంతో నిఘా కరువైంది. అందుకు ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయిలో పాజిటివ్‌ వచ్చిన వారు బయటకు రాకు ండా కట్టడి చేసే ఆలోచనలు చేస్తేనే వైరస్‌ వ్యాప్తి జరుగకుండా ఉంటుంది.

Updated Date - 2021-04-19T04:10:08+05:30 IST