Abn logo
Oct 24 2021 @ 00:49AM

కర్ణాటక మద్యం తరలింపు : ఒకరి అరెస్టు

పోలీసుల అదుపులో నిందితుడు

గుర్రంకొండ, అక్టోబరు 23: కర్ణాటక మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వాల్మీకిపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ శివసాగర్‌ తెలిపారు. మండలంలోని సంగసముద్రం పంచాయతీ యల్లంపల్లెకు చెందిన ఓ వ్యక్తి గ్రామానికి సమీపంలోని పొలంలో కర్ణాటక మద్యం ఉంచి విక్ర యానికి తరలిస్తుండగా దాడలు చేసి అరెస్టు చేశారు. అతడి నుంచి 281 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు.