ఒక్క మీట‌రు దూరం చాలు.... 80 శాతం క‌రోనా ముప్పు త‌ప్ప‌డానికి!

ABN , First Publish Date - 2020-06-04T12:11:52+05:30 IST

కేవ‌లం ఒక్క‌ మీటర్ దూరం కరోనా వైరస్ ముప్పును 82 శాతం మేర‌కు తగ్గిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న‌ప్పుడు ఒక్క మీట‌ర్ దూరం పాటించ‌డం ద్వారా వైరస్ ముప్పు నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని వెల్ల‌డ‌య్యింది. 16 దేశాలలో నిర్వ‌హించిన 172 అధ్యయనాల...

ఒక్క మీట‌రు దూరం చాలు.... 80 శాతం క‌రోనా ముప్పు త‌ప్ప‌డానికి!

న్యూఢిల్లీ: కేవ‌లం ఒక్క‌ మీటర్ దూరం కరోనా వైరస్ ముప్పును 82 శాతం మేర‌కు తగ్గిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న‌ప్పుడు ఒక్క మీట‌ర్ దూరం పాటించ‌డం ద్వారా వైరస్ ముప్పు నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని వెల్ల‌డ‌య్యింది. 16 దేశాలలో నిర్వ‌హించిన 172 అధ్యయనాల విశ్లేషణను లాన్సెట్ పత్రిక ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్‌డౌన్ ఎత్తేస్తున్న తరుణంలో సామాజిక దూరం పాటించ‌డం ఎంతో ముఖ్యమ‌ని తెలిపింది. దీనికితోడు చేతులను ఎప్ప‌టిక‌ప్పు‌డు శుభ్రప‌ర‌చుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుండి ఒక మీటర్ దూరంలో ఉండ‌టం ద్వారా సంక్రమణ ప్రమాదాన్ని 3 శాతం వరకు తగ్గించవచ్చని ఈ అధ్యయనాల్లో వెల్ల‌డ‌య్యింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మాదిరిగానే మ‌న దేశంలోనూ లాక్‌డౌన్ స‌డ‌లించారు‌. జూన్ 30 త‌రువాత లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్ర‌జ‌లు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్లడానికి అనుమ‌తి ఇచ్చారు. అలాగే రైళ్లు తిరుగుతున్నాయి. మాల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు, మతపరమైన ప్రదేశాలు జూన్ 8 నుండి తెరుచుకోనున్నాయి. అయితే ఈ మినహాయింపులు కంటైనేషన్ ప్రాంతానికి వర్తించవు. కాగా మహారాష్ట్ర, తమిళనాడు త‌దిత‌ర‌ రాష్ట్రాలు ఇప్పటికీ అంతర్రాష్ట్ర రవాణాను అనుమ‌తించ‌లేదు. 

Updated Date - 2020-06-04T12:11:52+05:30 IST