Teenmar Mallannaపై మరో ఫిర్యాదు..
ABN , First Publish Date - 2021-12-28T14:46:56+05:30 IST
Teenmar Mallannaపై మరో ఫిర్యాదు..
హైదరాబాద్ సిటీ/తిరుమలగిరి : పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం కంటోన్మెంట్ బోర్డు వార్డ్-7 మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్‌కుమార్ తన బృందంతో కలసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వార్డ్-7 టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు యశ్వంత్ కుమార్, ఉమేష్, దుర్గా ప్రసాద్, శేఖర్‌లతో పాటు మహిళా నాయకురాళ్లు వీరమణి, సువర్ణ, రజని, తదితరులు పాల్గొన్నారు.