రూపాయి బియ్యాన్ని అమ్మేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-10-24T03:20:57+05:30 IST

పేద ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం కిలో రూపాయికి, కరోనా కారణంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగానూ అందజేస్తున్న బియ్యాన్ని రేషన్‌కార్డుదారులు అమ్ముకుంటున్నారు.

రూపాయి బియ్యాన్ని అమ్మేస్తున్నారు!
పూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం, వాహనాలు

కడప జిల్లా నుంచి నెల్లూరుకు తరలింపు

 వారం రోజుల్లో 15 టన్నులు స్వాధీనం

రాపూరు, అక్టోబరు 23: పేద ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం కిలో రూపాయికి,  కరోనా కారణంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగానూ అందజేస్తున్న బియ్యాన్ని  రేషన్‌కార్డుదారులు అమ్ముకుంటున్నారు.   కడప జిల్లా చిట్వేలి మండలంనుంచి ఇలా సేకరించిన బియ్యాన్ని దళారులు నెల్లూరుకు తరలిస్తున్నారు. పది రోజుల వ్యవధిలో రాపూరు పోలీసులు సుమారు 15 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కిలో రూ.5లకు కొనుగోలు చేసిన ఈ బియ్యాన్ని దళారులు నెల్లూరులోని మిల్లులకు తరలించి, పాలిష్‌ చేసి మళ్లీ రూ.40కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పది రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద ఎత్తున బియ్యం స్వాధీనం కావడంతో పట్టుబడకుండా ఎన్ని టన్నుల బియ్యం నల్లబజారుకు తరలించారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాపూరు మండలంలో కూడా చౌక బియ్యాన్ని జనం చౌకధరకే అమ్మేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

Updated Date - 2021-10-24T03:20:57+05:30 IST