అప్పన్న ఆలయంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2021-09-18T05:52:01+05:30 IST

సింహాచలేశుడి సన్నిధిలో వార్షిక తిరు పవిత్రోత్సవాలు రెండవరోజైన శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ మాట్లాడు తూ బింబం అంటే ధ్రువమూర్తి, కుంభం అంటే కలశం, మండలం అంటే ప్రకృతి, హోమకుండం అంటే అగ్ని అని, చతుర్విద అర్చనలు చేయడమే చతుష్టానార్చనంగా వివరించారు.

అప్పన్న ఆలయంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు
ప్రత్యేక అలంకరణలో గోవిందరాజస్వామి

సింహాచలం, సెప్టెంబరు 17:  సింహాచలేశుడి సన్నిధిలో వార్షిక తిరు పవిత్రోత్సవాలు రెండవరోజైన శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ మాట్లాడు తూ బింబం అంటే ధ్రువమూర్తి, కుంభం అంటే కలశం, మండలం అంటే ప్రకృతి, హోమకుండం అంటే అగ్ని అని,  చతుర్విద అర్చనలు చేయడమే  చతుష్టానార్చనంగా వివరించారు. ఉత్సవాలలో భాగంగా సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు అనంతరం గోవిందరాజాస్వామిని ఉభయ దేవేరులతో అధిష్టింపజేసి సుదర్శన పెరుమాళ్‌ను యాగశాలలో వేదికపై ఉంచారు.  ప్రత్యేక హోమాలు జరిపి పూర్ణాహుతి ఇచ్చారు. 

Updated Date - 2021-09-18T05:52:01+05:30 IST