Abn logo
Apr 4 2020 @ 05:34AM

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ఉట్నూర్‌, ఏప్రిల్‌3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ 11వ రో జుకు చేరింది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వా రా కుటుంబంలోని ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. శుక్రవారం ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో రేషన్‌ షాపుల ద్వారా బియ్యం పంపి ణీ ప్రారంభించారు. బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీవోవినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌లు పరిశీలించారు.


అనంతరం బోయవాడ, శ్యాంపూర్‌, పులిమడుగు, ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్‌, పిట్టబొంగరం, కేస్లాపూర్‌ ప్రాంతాల్లో ఆర్డీవో వినోద్‌కుమార్‌, ఇంద్రవెల్లి తహసీల్దార్‌ రాఘవేంద్రరావుతో కలిసి రేషన్‌ షా పులను సందర్శించి పరిశీలించారు. దగ్గు, దమ్ము, జ్వరం, జలుబుతోపాటు గొంతునొ ప్పి ఉన్నట్లయితే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.


ఇచ్చోడరూరల్‌: ఇచ్చోడలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. కిరాణా దుకా ణాలు, కూరగాయల దుకాణాలు 11 గంటల తర్వాత మూసి వేయడంతో ఇచ్చోడలో నిర్మానుష్యంగా మారుతోంది. పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement