ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు నిపుణుల కమిటీ
ABN , First Publish Date - 2021-06-06T10:57:04+05:30 IST
రాష్ట్రంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకుగాను డీఎంకే ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల చెన్నై కేకేనగర్‌లో పద్మాశేషాద్రి బాలభవన్ సీబీఎస్‌ఈ పాఠశాల కామర్స్ టీచ
చెన్నై: రాష్ట్రంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకుగాను డీఎంకే ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల చెన్నై కేకేనగర్‌లో పద్మాశేషాద్రి బాలభవన్ సీబీఎస్‌ఈ పాఠశాల కామర్స్ టీచర్ ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ సందర్భంగా విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, వీడియో కాల్స్ చేసి వారిని లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోఫణలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ పాఠశాల పూర్వ విద్యార్థినులు వాట్సప్ గ్రూప్‌ల ద్వారా ఆ కామర్స్ టీచర్ కామలీలలను వెల్లడి చేయడంతో పోలీసులు ఆ టీచర్‌ను అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో ఇకపై ఆన్‌లైన్ తరగతులను విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురికాని రీతిలో నిర్వహించడానికి అనువైన విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఆ మేరకు కళాశాలల విద్యాశాఖ సంచాలకులు పూర్ణచంద్రన్ నాయకత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులున్నారు. ఈ కమిటీ ఈనెల 11 వతేదీలోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నదని స్టాలిన్ తెలిపారు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే ఉపాధ్యాయులు ప్రవర్తించాల్సిన తీరు. వారు ధరించాల్సిన దుస్తులు గురించి, విద్యార్థులతో సంభాషించే విధానం గురించి ఈ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తగు సిఫారసులు చేయనుంది.