ఐసొలేషన్‌ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-11T05:19:08+05:30 IST

నగరంలోని స్థానిక కార్మిక కర్షక భవనంలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో కేంద్రం చైర్మన్‌ కె ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు.

ఐసొలేషన్‌ కేంద్రం ప్రారంభం

కర్నూలు(న్యూసిటీ), మే 10: నగరంలోని స్థానిక కార్మిక కర్షక భవనంలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో కేంద్రం చైర్మన్‌ కె ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. సీనియర్‌ వైద్యుడు డా. లక్ష్మీనారాయణ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌, సీనియర్‌ వైద్యులు డా.రాంగోపాల్‌, డా. నాగభూషణరావు, డా. వినోద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాలకు ముందు జాగ్రత్త లేకపోవడంతోనే నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో సీపీఎం చొరవ చేసి సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో ఐసొలేషన్‌ కేంద్రం ప్రారంభించడం శుభపరిణామని గఫూర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం సభ్యులు పి. నిర్మల, రామాంజనేయులు, రాధాక్రిష్ణ, డి.గౌస్‌దేశాయ్‌, రాముడు, సి.గురుశేఖర్‌, రాజశేఖర్‌  పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T05:19:08+05:30 IST