Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టీల్‌ప్లాంట్‌ ఆలయంలో ఇరుముడి సమర్పణకు అవకాశం

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 30: మాలధారణ భక్తులకు స్టీల్‌ప్లాంట్‌ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాలధారణ చేసి శబరిమల వెళ్లే అవకాశం లేని వారు ఇరుముడి సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఇరుముడి ధరించిన భక్తులు స్వామి వారి 18 మెట్ల ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యక్షంగా నెయ్యాభిషేకం జరుపుకోవచ్చు. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి దర్శనాలు కల్పిస్తున్నారు. ఆలయం ఉదయం 5:30 నుంచి 11:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుంచి 8:30 గంటల వరకు  తెరిచి ఉంటుంది. నెయ్యాభిషేకం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement