సేంద్రియ సాగే మేలు

ABN , First Publish Date - 2020-12-04T05:12:13+05:30 IST

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పంట సాగు చేయడం ద్వారా ఎకరాకు 38 బస్తాల ధాన్యం దిగుబడి సాధించినట్లు మండల వ్యవసాయాధికారి పి.శంకరరావు అన్నారు.

సేంద్రియ సాగే మేలు

కొమరాడ, డిసెంబరు 3 : ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పంట సాగు చేయడం ద్వారా ఎకరాకు 38 బస్తాల ధాన్యం దిగుబడి సాధించినట్లు మండల వ్యవసాయాధికారి పి.శంకరరావు అన్నారు. గురువారం గంగరేగువలస గ్రామంలో పంట కోత ప్ర యోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఎంటీ యూ 1064 వరి రకం ఎకరాకు 38 బస్తాలు దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. నారుమడి వేసే సమయంలో విత్తనాలను బీజా మృతంతో శుద్ధి చేయడం జరిగిందని రైతు సీతారాం చెప్పారు. ఘ న జీవామృతం, ద్రవ జీవామృతం వినియోగించడంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏవో సూచనల మేరకు అవలం భించడం వల్ల అధిక దిగుబడులు సాధించగలిగానని రైతు చెప్పా రు. ఏఈవో శంకరరావు, వీఏవో చాందిని, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T05:12:13+05:30 IST