ప్రాణవాయువు ఇస్తాం
ABN , First Publish Date - 2021-04-28T07:03:12+05:30 IST
కరోనా బారినపడి ప్రాణవాయువు అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న వేళ.. భారతదేశాన్ని ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకొచ్చాయి. భారత్‌కు 700 ఆక్సిజన్ కంటెయినర్లు, ఇతర
ముందుకొచ్చిన భూటాన్, ఫ్రాన్స్. ఐర్లండ్, థాయ్‌లాండ్ దేశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా బారినపడి ప్రాణవాయువు అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న వేళ.. భారతదేశాన్ని ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకొచ్చాయి. భారత్‌కు 700 ఆక్సిజన్ కంటెయినర్లు, ఇతర వైద్య పరికరాలను పంపుతామని ఐర్లండ్ ప్రకటించింది. భూటాన్.. రోజుకు 40 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను అసోంకు తరలించేందుకు సిద్ధమైంది. వాయుసేన ద్వారా థాయ్‌లాండ్ నుంచి ఆక్సిజన్ కంటెయినర్లు భారత్‌కు వచ్చాయి. సింగపూర్ నుంచి మరిన్ని రానున్నాయి.
ఆక్సిజన్ జనరేటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ కంటెయినర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను పంపుతామని ఫ్రాన్స్ పేర్కొంది. అలాగే.. 275 ఆక్సిజన్ కంటెయినర్లు, 440 ఆక్సిజన్ సిలిండర్లు, 240 ఆక్సిజన్ రెగ్యులేటర్లను 210 పల్స్ ఆక్సిమీటర్లు సహా.. నిమిషానికి 120 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన డిప్లాయబుల్ ఆక్సిజన్ కంటెయినర్ సిస్లమ్స్‌ను పంపుతామని అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ న్యూసోమ్ ప్రకటించారు. రాష్ట్రాల కోసం కేంద్రం.. 20 టన్నులు, 10 టన్నులతో కూడిన 20 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంది. 70 టన్నుల ట్యాంకర్లతో రాయగఢ్ నుంచి ఢిల్లీకి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు చేరుకుంది. విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలతో కూడిన నౌక లక్షద్వీ్‌పకు చేరుకుంది. వచ్చేనెలలో 44 ఆక్సిజన్ ప్లాంట్లను ఢిల్లీ ప్రభుత్వం నెలకొల్పనుంది. తమిళనాడు తూత్తుకుడిలో మూతపడిన వేదాంత ఆక్సిజన్ ప్లాంటును తెరిచేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. ఆక్సిజన్ ‘జాతీయ అవసరాల రీత్యా’ జూలై 31 వరకూ అనుమతులిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆక్సిజన్ ఉత్పత్తి పెరుగుతోంది: ప్రధానితో అధికారులు
దేశంలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 8,922 టన్నులకు పెంచినట్టు మంగళవారం అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. నెలాఖరుకు ఉత్పత్తిని 9,250 టన్నులకు పెంచుతామన్నారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి, వైమానిక దళం రంగంలోకి దిగి ఆక్సిజన్‌ను తరలిస్తున్న తీరును వివరించారు. రాష్ట్రాలు పీఎ్‌సఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించేందుకు సహకరించాలని అధికారులకు మోదీ సూచించారు.