Abn logo
May 5 2021 @ 08:22AM

తమిళనాడులో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి

చెన్నై: దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విళ‌య‌తాండవం చేస్తోంది. రోజురోజుకు మరణాలు, కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఇదే ఘటన తమిళనాడులోని చెంగల్ పట్టులో చోటు చేసుకుంది. చెంగల్ పట్టులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మరికొందరికి ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులును ఆస్పత్రి సిబ్బంది రోగులను ఇతర హాస్పిటల్‎కు తరలించారు.

Advertisement
Advertisement
Advertisement