Abn logo
Aug 9 2021 @ 10:55AM

పాకలపాడు చెరువు సర్వే చేస్తే నిజాలు బట్టబయలు: అయ్యన్న

నర్సీపట్నం: గొలుగొండ మండలంలోని పాకలపాడు పెద్ద చెరువు సర్వే చేయిస్తే.. అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖరులకు ఓ వీడియో సందేశాన్ని  విడుదల చేశారు. పెద్ద చెరువు విషయంలో ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దొంగ పాసుపుస్తకాలు సృష్టించి రూ.11 కోట్లు రుణం తీసుకున్న వైసీపీ నాయకుడుపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు. దొంగ పాస్‌పుస్తకాలు ఇచ్చిన తహసీల్దార్‌పై తీసుకున్న చర్యలు ఏమిటిని ప్రశ్నించారు. నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎమ్మెల్యేకి ఉందని హితవు పలికారు.