భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతికి అంగీకరించిన పాక్!

ABN , First Publish Date - 2021-04-01T02:00:36+05:30 IST

భారత్‌తో వాణిజ్య బంధాన్ని పునరుద్ధరించేందుకు పాక్ సిద్ధమైంది. ఇక్కడి పత్తిని దిగుమతి చేసుకునేందుకు పాక్ వ్యాపారులకు అనుమతిచ్చింది.

భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతికి అంగీకరించిన పాక్!

న్యూఢిల్లీ: భారత్‌తో వాణిజ్య బంధాన్ని పునరుద్ధరించేందుకు పాక్ సిద్ధమైంది. ఇక్కడి పత్తిని దిగుమతి చేసుకునేందుకు పాక్ వ్యాపారులకు అనుమతిచ్చింది. పాక్ ఆర్థిక మంత్రి హమ్మద్ అజర్ ఈ విషయాన్ని బుధవారం నాడు వెల్లడించారు. పత్తితో పాటూ చక్కెర దిగుమతులకూ అనుమతించినట్టు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని భారత్ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం భారత్‌తో అన్ని ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను తెంచేసుకుంది. తదనంతర పరిణామాల్లో అక్కడ పత్తికి, చక్కెరకు కొరత ఏర్పడింది. ఇతర దేశాల దిగుమతులు ఖరీదైనవిగా తేలడంతో వీటిని భారత్ నుంచే దిగుమతి చేసుకునేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక పాక్ వ్యాపారుల ఒత్తిడి కూడా పనిచేసినట్టు సమాచారం. అయితే..ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పాక్షికంగా ప్రారంభమైన నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు కూడా త్వరలో కుదుటపడుతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-04-01T02:00:36+05:30 IST