ఆయిల్‌ పామ్‌ తోటల అభివృద్ధిలో పాలమూరు జిల్లా ముందంజ

ABN , First Publish Date - 2021-12-16T05:06:55+05:30 IST

ఆయిల్‌ పామ్‌ తోటల అభివృద్ధిలో పాలమూరు జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు.

ఆయిల్‌ పామ్‌ తోటల అభివృద్ధిలో పాలమూరు జిల్లా ముందంజ
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

- 2163 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ తోటల సాగుకు 446 మంది రైతుల ఎంపిక

- ప్రీ యూనిక్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ఎం.డీతో కలెక్టర్‌ సమీక్ష


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), డిసెంబరు 15 : ఆయిల్‌ పామ్‌ తోటల అభివృద్ధిలో పాలమూరు జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. బధవారం ఆయిల్‌ తోటల అభివృద్ధి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ యూనిక్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ఎం.డి. డాక్టర్‌ ప్రసాద్‌ కలెక్టర్‌ ను ఆయన చాంబరులో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ తోటల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో 2163 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ తోటలు వేసుకునేందుకు 446 మంది రైతులను ఎంపిక చేశామని చెప్పారు. పాలమూరు జిల్లా నుంచి ఆయిల్‌ పామ్‌ తోటలపై అవగాహన, క్షేత్ర సందర్శన నిమిత్తం 36 మంది రైతులను ఉద్యాన శాఖ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటకు ఎక్స్‌పోజర్‌ ట్రిప్‌కు పంపినట్లు తెలిపారు. ప్రీ యూనిక్‌ ఇండియా లిమిటెడ్‌ ఎం.డి. డాక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌ పామ్‌ తోటలు పెంచేందుకు కావాల్సిన మొక్కలు, నర్సరీలు వనపర్తి జిల్లా కడుకుంట్లలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మూడు లక్షల ఆయిల్‌ పామ్‌ మొక్కలు, రైతులకు అవసరమైన ఓరియంటేషన్‌, శిక్షణ, రిజిస్ట్రేసన్‌ వంటి కార్యక్రమాలు ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ తోటల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి వీవీఎస్‌ సాయిబాబా, నాబార్డు ఏజీఎం శ్రీనివాస్‌, ఎల్‌డీఎం నాగరాజు, తదితరులు ఉన్నారు.


రైతులకు ఆయిల్‌ పామ్‌ అక్షయపాత్ర


పాలమూరు, డిసెంబరు 15 : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రైతులకు ఆయిల్‌పామ్‌ సాగు అక్షయ పాత్రలా పనిచేస్తుందని (డీహెచ్‌అండ్‌ఎస్‌వో) జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికా రి వి.వి.ఎస్‌ సాయిబాబా వివ రించారు. బుధవారం మహ బూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, ఇతర ప్రాంతా ల నుంచి 36మంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, దమ్మపేట మండ లాల్లో పామాయిల్‌ తోటల క్షేత్ర ప్రదర్శన చేశారు. పామాయిల్‌ తోటలపెంపకంతో ఆదాయమెలా పొం దవచ్చనే విషయాన్ని వివరించారు. రైతులకు ఉన్న అనుమానాలను అక్కడి రైతులు నివృత్తి చేశారు. పామాయిల్‌ సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సా హం మరువలేనిదన్నారు. ఆయిల్‌పామ్‌ జీవిత కా లం 50ఏళ్లు అని, తోటలకు ఎలాంటి పురుగులు, తెగుళ్లు ఆశించవని, కోతులు, అడవి పందుల బెడద ఉండదని, గెలలను దొంగిలించే బాధ ఉండదని తెలి పారు. మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల దగ్గరికే గెలలను కొనేందుకు వ్యాపారులు వ స్తారని తెలిపారు. నీటి పరివాహక ప్రాంతాల్లో సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీ అందిస్తుం దని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేయి ఎక రాల్లో సాగుచే యాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశిం చిందని పేర్కొ న్నారు. పామాయిల్‌ను మలే షియా నుంచి దిగుమతి చేసుకోవటాన్ని తగ్గించుకో వాలని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి మహేందర్‌, రచన మేడమ్‌, వ్యవసాయాధికారి రాజేష్‌ఖన్న, పామాయిల్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-16T05:06:55+05:30 IST