Abn logo
Apr 19 2021 @ 00:41AM

వైభవంగా పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం

ప్రత్యేక అలంకరణలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవవిగ్రాహాలు

ఆత్మకూరు, ఏప్రిల్‌18 : మండల పరిధిలోని పంపనూరు ఆలయంలో ఆదివారం చైత్ర శుద్ధ షష్టిని పురస్కరించుకొని సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని  వైభవంగా నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక అలం కరణ  చేశా రు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణాన్ని ఆలయ అ ధికారులు, అర్చకులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  శాసో్త్రక్తంగా నిర్వహించారు. 

అనంతపురం టౌన : చైత్రశుద్ధ షష్టిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని పలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  చెరువుకట్టపై వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రధానార్చకుడు ప్రసాద్‌ నంబూద్రి నేతృత్వంలో స్వామివారి మూలవిరాట్‌కు  విశేష పూజలు  చేశారు.


Advertisement
Advertisement
Advertisement