అవిశ్వాసానికి తెర

ABN , First Publish Date - 2021-04-19T05:12:21+05:30 IST

పంచాయతీల్లో కొత్త రాజకీయాలు చోటుచేసుకుం టున్నాయి. ఉప సర్పంచ్‌లపై అవిశ్వాసాలకు రాజకీయ తె ర తీస్తున్నారు.

అవిశ్వాసానికి తెర
జగిత్యాల ఆర్‌డీవోకు తీర్మాన ప్రతిని అందజేస్తున్న కొడిమ్యాల వార్డు సభ్యులు

- ఉప సర్పంచ్‌లకు పొంచి ఉన్న పదవీ గండం

- రెండేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో పావులు కదుపుతున్న వైనం

- పంచాయతీల్లో ముదురుతున్న విభేదాలు

- కొడిమ్యాల ఉప సర్పంచ్‌పై ఆర్డీవోకు తీర్మాన ప్రతి అందజేత

జగిత్యాల, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో కొత్త రాజకీయాలు చోటుచేసుకుం టున్నాయి. ఉప సర్పంచ్‌లపై అవిశ్వాసాలకు రాజకీయ తె ర తీస్తున్నారు. రెండేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఉప సర్పంచ్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవీచ్యుతులను చేయడానికి పలువురు వార్డు సభ్యులు పావులు కదుపుతున్నారు. దీంతో ఉప సర్పంచ్‌లకు పదవీ గండం పొంచిఉన్నట్లయింది. జగిత్యాల జిల్లాలో ఉప సర్పంచ్‌లపై అవిశ్వాస రాజకీ యాలు షురూ అయ్యాయి. జిల్లాలో తొలిసారిగా కొడిమ్యాల ఉప సర్పంచ్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ జగిత్యాల ఆర్డీవో మాధురికి వార్డు సభ్యులు తీర్మాన ప్రతిని అందజేశారు. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికలు జరిగిన ప్రతీ రెండేళ్లకోసారి ఉప సర్పంచ్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలుంటాయి.  రెండే ళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్ని కల అనంతరం జగిత్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో తొలి సమావేశాలు 2019 ఫిబ్రవరి 2వ తేదీన జరిగాయి. 2021 ఫిబ్రవరి 2వ తేదికి తొలి సమావేశం జరిగి రెండేళ్లు పూర్తయింది. దీంతో అవిశ్వాస రాజకీయాలకు తెర లేపుతున్నారు. 

- జిల్లాలో 379 మంది ఉప సర్పంచ్‌లు..

జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి డివిజన్‌లలో 380 సర్పంచ్‌ స్థానాలకు గానూ 379 స్థానాలకు గత రెండేళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. మల్లాపూర్‌ సర్పంచ్‌ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ప్రభుత్వం 500 జనాభా దాటిన అనుబంధ గ్రామాలు, తండాలను పంచా యతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో ఏర్పడిన 60 పంచాయతీల్లో సైతం తొలిసారిగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్ర మాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించి రెండేళ్లు పూర్తయింది. జిల్లాలో 379 మంది సర్పంచ్‌లలో పురుషులు 144 మంది, 236 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలోని పంచాయతీల్లో 379 మంది ఉప సర్పంచ్‌లు, 3,500 మంది వార్డు సభ్యులున్నారు. బాధ్యతలు స్వీకరించి రెండేళ్ల కాలం పూర్తికావడంతో ఇప్పటికే పలు పం చాయతీల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల మధ్య విబేధాలు పొడచూపుతున్నాయి. 

ఆర్డీవో పరిధిలో..

ఉప సర్పంచ్‌లపై అవిశ్వాస తీర్మానం అంశం ఆర్డీవో స్థాయి అధికారి పరిధిలో ఉంటుంది. నిబంధనల ప్రకారం పంచాయతీలో ఉన్న మెజార్టీ సభ్యులు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసి సంబంధిత ప్రతిని ఆర్డీవోకు అందించాలి. ఇందులో ఇద్దరు వార్డు సభ్యులు స్వయంగా ఆర్డీవో కార్యాల యానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉంటుంది. తీర్మానం అందిన పదిహేను రోజుల్లోగా పంచాయతీ పాలకవర్గానికి అధికారులు నోటీసులు ఇచ్చి అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి సమావేశ తేదీని ప్రకటిస్తారు. సమావేశానికి హాజరైన మెజార్టీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతు తెలిపితే ఉప సర్పంచ్‌ పదవి నుంచి తొలిగిపోయినట్లుగా అధికారులు ప్రకటించే వీలుంటుంది. మెజార్టీ సభ్యులు మద్దతు పలకకుంటే అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లుగా అధికారులు ప్రకటిస్తారు. 

- చెక్‌ పవర్‌తో ఉప సర్పంచ్‌కు డిమాండ్‌...

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ను కల్పించింది. దీంతో పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉప సర్పంచ్‌ల భాగస్వామ్యం లేనిది ఒక్క రూపాయిని కూడా ఖర్చు చేసే అవకాశం లేకుండా పో యిం ది. దీంతో సహజంగానే ఉప సర్పంచ్‌లు పంచాయతీల్లో కీలకంగా మా రారు. పంచాయతీల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల మఽధ్య విభేదాలు ముదరడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల రాజకీయపరమైన వ్యవహారాల సైతం అవిశ్వాస తీర్మానాలకు కారణంగా ఉంటున్నాయి. 

- తొలిసారిగా కొడిమ్యాలలో..

జిల్లాలోని కొడిమ్యాలలో తొలిసారిగా ఉప సర్పంచ్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ మెజార్టీ వార్డు సభ్యులు తీర్మానం చేశారు. సంబంధిత తీర్మా న ప్రతిని జగిత్యాల ఆర్డీవో మాధురికి అందజేశారు.  పదిహేను రో జుల్లోపు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై మెజార్టీ సభ్యుల నిర్ణయాన్ని సేకరించాల్సి ఉంది. ఉప సర్పంచ్‌లపై అవిశ్వాస రాజకీయాలకు తెరలేవడం పంచాయతీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-04-19T05:12:21+05:30 IST