మామిడి పండ్లతో ఆల‌య అలంక‌ర‌ణ‌... కోవిడ్ బాధితుల‌కు విత‌ర‌ణ‌!

ABN , First Publish Date - 2021-05-16T17:33:37+05:30 IST

మ‌హారాష్ట్ర‌లోని పండ‌ర్‌పూర్‌లోగ‌ల విఠ‌ల్- రుక్మిణి ఆల‌యంలో...

మామిడి పండ్లతో ఆల‌య అలంక‌ర‌ణ‌... కోవిడ్ బాధితుల‌కు విత‌ర‌ణ‌!

పండ‌ర్‌పూర్: మ‌హారాష్ట్ర‌లోని పండ‌ర్‌పూర్‌లోగ‌ల విఠ‌ల్- రుక్మిణి ఆల‌యంలో అక్ష‌య తృతీయ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యాన్ని సుమారు ఏడు వేల మామిడిపండ్ల‌తో అలంక‌రించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాపిస్తున్న త‌రుణంలోనూ అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆల‌యంలో అక్ష‌య తృతీయ వేడుక‌లు నిర్వ‌హించారు. మీడియాకు అందిన వివ‌రాల ప్రకారం పూణేకు చెందిన వినాయక్ కచ్చి అనే వ్యాపారవేత్త ఈ మామిడి పండ్లను ఆలయానికి అందించారు. మామిడి పండ్ల‌తో అలంక‌రించిన ఈ ఆల‌యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  మ‌హారాష్ట్ర ప‌రిస‌ర ప్రాంతాల్లో ల‌భించే అల్ఫోన్సో ర‌క‌పు మామిడి పండ్ల‌ను ఆల‌య అలంక‌ర‌ణ కోసం వినియోగించారు.  అనంత‌రం ఈ మామిడి పండ్ల‌ను క‌రోనా బాధితుల‌కు పంపిణీ చేశారు. 

                                 MrudulWorld All-in-One సౌజ‌న్యంతో...



Updated Date - 2021-05-16T17:33:37+05:30 IST