ఆస్తి పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-18T03:42:09+05:30 IST

ఆస్తి పన్నుల పెంపు జీవోలను ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అ

ఆస్తి పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలి
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం, అఖిలపక్షం నాయకులు

గూడూరురూరల్‌, జూన్‌ 17: ఆస్తి పన్నుల పెంపు జీవోలను ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు. గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణ సంస్కరణల పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పన్నుల పెంపు నిర్ణయాన్ని నిరసిస్తూ స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మున్సిపాలిటీలలో వార్షిక  అద్దెవిలువ ఆధారంగా పన్నులను వసూలు చేసేవారన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 196, 197,198 జీవోల ఆధారంగా స్థలం విలువ, భవనం విలువ కలుపుకుని ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువప్రకారం ఇంటి పన్నులు వసూలు చేయాలనుకోవడం దారుణమన్నారు. చెత్తసేకరణకు, డ్రైనేజీకాలువలు శుభ్రం చేసేందుకు, వీధిదీపాలకు పన్నులు విధించి ప్రజలపై భారాలను మోపుతున్నారన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఈతరహాలో పన్నులు విధించలేదన్నారు. అనంతరం కమిషనర్‌ రఘుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కాలేషా, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఆరికట్ల మస్తాన్‌నాయుడు, వాటంబేడు శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T03:42:09+05:30 IST