బొప్పాయికీ తప్పని కరోనా కష్టాలు

ABN , First Publish Date - 2020-08-14T08:37:37+05:30 IST

కరోనా కష్టాలు బొప్పాయి పంటకూ తప్ప లేదు. ఒక వైపు తీవ్ర వైర్‌సల కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడం, మరో వైపు కరోనా కారణంగా కొనుగోళ్ళు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఈ ఏడాది బొప్పాయి రైతుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇక పంట కోతకొచ్చే సమయానికి వర్షాలు వరుస

బొప్పాయికీ తప్పని కరోనా కష్టాలు

 పడిపోయిన అమ్మకాలతో ధరలు పతనం

 వైర్‌స ముట్టడితో దిగుబడి అంతంత మాత్రం


కలికిరి, ఆగస్టు 13: కరోనా కష్టాలు బొప్పాయి పంటకూ తప్ప లేదు. ఒక వైపు తీవ్ర వైర్‌సల కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడం, మరో వైపు కరోనా కారణంగా కొనుగోళ్ళు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఈ ఏడాది బొప్పాయి రైతుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇక పంట కోతకొచ్చే సమయానికి వర్షాలు వరుసగా పడటంతో బొప్పాయి పండ్లలో నాణ్యత తగ్గిపోవడంతోపాటు రుచి కూడా తరిగిపోవడం మరో కారణంగా చెబుతున్నారు. రైతుల తోటల వద్ద టన్ను పంటను కేవలం రూ.


నాలుగైదు వేలు పెట్టి వ్యాపారులు కొనుగోలు చేయడం గగనంగా మారింది. చిల్లర మార్కెట్లో కిలో రూ. 15 వంతున అమ్ముతున్నా కొనేవాళ్ళు కరువయ్యారని అటు రైతులు, ఇటు వ్యాపారులు వాపోతున్నారు. గతంలో టన్నుకు రూ.27 వేలు పైబడి రైతుకు గిట్టుబాటయ్యింది. ప్రస్తుతం కనీసం రూ.12 వేలకు అమ్ముడయితేగానీ రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి వుంది. కరోనా విస్తృతి కారణంగా ఉద్యాన శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే కావడంతో వివిధ రకాల అంతుబట్టని వైర్‌సలు పంటను చుట్టుముట్టాయి. జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఈ బొప్పాయి పంట వేశారు.


వి.కోట, బైరెడ్డిపల్లె, రామకుప్పం, శాంతిపురం, కుప్పం, మదనపల్లె, కలికిరి, కలకడ, గుర్రంకొండ, రామసముద్రం, పలమనేరు, పుంగనూరు, వి.కొత్తకోట, పీటీఎం తదితర మండలాల్లో ఈ ఏడాది బొప్పాయి పంట అధికంగా సాగుచేశారు. గత వేసవిలో చీనీ, అరటి, మామిడి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు నేరుగా సరఫరా చేసి రైతులను ప్రభుత్వం కొద్దిలో కొద్దిగానైనా ఆదుకొంది. కరోనా కాలంలో బొప్పాయి వాడకాన్ని ప్రోత్సహించేలా శాస్త్రవేత్తలు ప్రచారం చేస్తున్నా కొనుగోలుకు మాత్రం జనం ముందుకు రావడం లేదు. ఈ ఏడాది బొప్పాయి రైతులను ఆదుకుంటేగానీ నష్టాల నుంచి గట్టెక్కలేరని పలువురు రైతులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2020-08-14T08:37:37+05:30 IST