Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగం బోర్‌ కొట్టిందంటూ కోర్టు కెక్కిన ఉద్యోగి

ఓ ఉద్యోగి తన ఉద్యోగం బోర్‌ కొడుతోందని తను పని చేసే సంస్థ యజమాన్యంపై కోర్టుకెక్కాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌ దేశ రాజధాని పారిస్‌లో జరిగింది. 


పారిస్‌లో ఇంటర్‌ పర్ఫ్యూమ్‌ అనే అత్తరు కంపెనీలో పనిచేసే ఫ్రెడరిక్‌ డేనార్డ్‌ అనే ఉద్యోగి 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాతి సంవత్సరం తనకు బోర్‌ కొట్టే ఉద్యోగం ఇచ్చారంటూ కోర్టుకు వెళ్లాడు. ముఖ్యమైన క్లయింటు చేజారి పోవడంతో తనను చిన్నాచితకా పనులు చేసే మేనేజర్‌ జాబ్‌కు మార్చారని, దానివల్ల తన మానసిక స్థితి దెబ్బతిన్నదని డేనార్డ్‌ కోర్టులో వివరించాడు.


నాలుగేళ్ల పోరాటం తరువాత కోర్టు అతనికి అనుకూల తీర్పు చెప్పింది. 40 వేల యూరోల (రూ.33 లక్షలు) పరిహారం ఇవ్వాల్సిందిగా సంస్థను ఆదేశించింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement