Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలి

కనిగిరి, డిసెంబరు 5: టీడీపీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం పట్టణ 10వ వార్డు టీడీపీ కమిటీ ఎంపిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీఎస్‌ పధకం పేరుతో ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూలు చేసి రిజిస్ర్టేషన్‌ చేయిస్తామని చెప్పే మాటల్లోని వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలన్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయించి ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హమీ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలన్నారు. గడచిన రెండున్నరేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు శూన్యమని ఆరోపించారు. పధకాల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ సీయం జగన్‌రెడ్డి ప్రాంతాల వారిగా రాష్ర్టాన్ని దోచుకుంటున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జీ+3 ఇళ్ళ నిర్మాణాలు పటిష్టంగా చేపట్టినప్పటికి వాటి ఊసు రానీయకుండా ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పధకాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఫిరోజ్‌, ఫారూక్‌, 10వ వార్డు టీడీపీ యువత, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

10వ వార్డు టీడీపీ కమిటీ ఎంపిక

కనిగిరి : పట్టణంలోని 10వ వార్డు టీడీపీ కమిటీ ఎంపిక ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగింది. కమిటీ ఎంపికలో నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, మాజీ అంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు రోషన్‌ సందాని ఎన్నిక నిర్వహించారు. ఈ కమిటీలో 10వ వార్డు టీడీపీ అధ్యక్షుడిగా షేక్‌ ఖాదర్‌వలి, ఉపాధ్యక్షుడిగా చిలకపాటి ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాసులు, కార్యానిర్వాహక కార్యదర్శులుగా సీదా మాలకొండయ్య, మల్లాల నరసింహారావు, షేక్‌ ఖాదర్‌బాష, కార్యదర్శులుగా పాలూరి సత్యం, సీదా మధు, సయ్యద్‌ మీరా ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సారధి, మహాబాష, పెద్దిశెట్టి కొండలు, చెన్నారావు, వెలుతుర్ల కొండలు, చెరుకూరి మల్లికార్జున్‌, పఠాన్‌ షరీప్‌, షేక్‌ చినమస్తాన్‌, సయ్యద్‌ హనీ్‌ఫషాలు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫిరోజ్‌, ఫారూక్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement