Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్దేశ పూర్వకంగానే పవన్‌ను వైసీపీ కెలికిందా?

అమరావతి/హైదరాబాద్: ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలని నిర్ణయించింది. సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. మరోవైపు ఈ విధానంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాజకీయ రచ్చ ప్రారంభమైంది. వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. పవన్ విమర్శలకు మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. అయితే ఈ కౌంటర్లు ఘాటుగా ఉండటంతో దుమారం రేగింది. అప్రమత్తమైన సినీ ప్రముఖులు.. మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. పవన్‌ వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీకి సంబంధంలేదని సినీ ప్రముఖులు తెలిపినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మరోవైపు పవన్ కల్యాణ్ అమరావతిలో జనసేన కార్యకర్తలతో సమావేశమై మరోసారి ప్రభుత్వం, మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో ‘‘వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని పవన్ కల్యాణ్ ఎలా చెప్పారు?. బయటకు రా తేల్చుకుందాం అని  పవన్ జగన్‌కి సవాల్ చేయడంలో ధీమా ఏంటి?. ఒక వైపు కార్యకర్తలతో జనసేనాని కార్యాచరణ సమావేశం. మరోవైపు సినీ నిర్మాతలతో మంత్రి పేర్ని నాని టికెట్ల చర్చలు. ఒక్కసారిగా జనసేన పార్టీ హెడ్ లైన్స్‌లోకి ఎందుకు ఎక్కుతోంది?. నిజంగానే వైసీపీ ఉద్దేశ్య పూర్వకంగానే పవన్‌ను కెలికిందా?. భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైనా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారా?. సినిమా టికెట్ల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో రాజీపడ్డారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement