మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-07-23T05:56:31+05:30 IST

మండలంలోని కేలి(బి) గ్రామానికి చెందిన సర్పంచ్‌ నారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు ఇవ్వాలని కోరుతూ గురువారం ఎంపీపీ మోతీరాంకు వినతిపత్రం అంద జేశారు.

మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించాలి
ఎంపీపీకి వినతిపత్రం అందజేస్తున్న లబ్ధిదారులు

కెరమెరి, జూలై 22: మండలంలోని కేలి(బి) గ్రామానికి చెందిన సర్పంచ్‌ నారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు ఇవ్వాలని కోరుతూ గురువారం ఎంపీపీ మోతీరాంకు వినతిపత్రం అంద జేశారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించి రెండు సంవత్సరాలవుతున్నా ఈజీఎస్‌ అధికారులు బిల్లులు చెల్లించడంలేదన్నారు. వెంటనే సమస్యను ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వివరించి టీఏ, ఈసీ లను పిలిపించి మాట్లాడి బిల్లులు చెల్లించేలా చూస్తామని ఎంపీపీ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-23T05:56:31+05:30 IST