ధాన్యం కొనుగోళ్లకు రూ.3.70 కోట్ల చెల్లింపులు

ABN , First Publish Date - 2021-08-02T05:10:20+05:30 IST

జిల్లాలో రబీ సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.3.70 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు జిల్లా సివిల్‌ సప్లయిస్‌ డీఎం మోహన్‌బాబు తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లకు రూ.3.70 కోట్ల చెల్లింపులు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 1: జిల్లాలో రబీ సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.3.70 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు జిల్లా సివిల్‌ సప్లయిస్‌ డీఎం మోహన్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌లో రైతుల నుంచి 3600 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించి రూ6కోట్ల రూపాయల మేరకు ధాన్యంగా గుర్తించామన్నారు. ఇంకా రూ.2.30 కోట్ల మేరకు ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉందన్నారు. ఈ మిగతా డబ్బులు రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో జమ చేసే పనులు జరుగుతుందన్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)లో భాగంగా జిల్లాలో పలు రైసు మిల్లుల నుంచి 20వేల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి గాను ఇప్పటి వరకు మిల్లుల నుంచి 14వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే చేరాయన్నారు. మిగిలిన 6వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ రైస్‌ను ఆగస్టు నెల ఆఖరునాటికి పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించామని చెప్పారు.

Updated Date - 2021-08-02T05:10:20+05:30 IST