మలబార్‌ డ్రిల్‌తో శాంతి నెలకొనాలి

ABN , First Publish Date - 2020-10-21T09:20:39+05:30 IST

తమ సైనికుడిని భారత్‌ విడిచిపెడుతుందని చైనా మిలటరీ ఆశాభావం వ్యక్తం చేసింది. తూర్పు లద్దాఖ్‌ వద్ద సోమవారం చైనా ..

మలబార్‌ డ్రిల్‌తో శాంతి నెలకొనాలి

మా సైనికుడిని భారత్‌ విడిచిపెడుతుందని ఆశిస్తున్నాం: చైనా


బీజింగ్‌, అక్టోబరు 20: తమ సైనికుడిని భారత్‌ విడిచిపెడుతుందని చైనా మిలటరీ ఆశాభావం వ్యక్తం చేసింది. తూర్పు లద్దాఖ్‌ వద్ద సోమవారం చైనా పీఎల్‌ఏకు చెందిన సైనికుడు సరిహద్దు దాటిన విషయం తెలిసిందే. అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నాయి. పీఎల్‌ఏకు చెందిన వాంగ్‌ యా లాంగ్‌గా అతడిని గుర్తించాయి. ుూసరిహద్దుల్లో స్థానికుల జడల బర్రె తప్పిపోతే.. దాన్ని తీసుకురావడానికి మా సైనికుడు ప్రయత్నించాడు. ఆ సమయంలో భారత సైనికులు అతడిని అరెస్టు చేశారు్‌్‌ అని పీఎల్‌ఏ అధికార ప్రతినిధి, సీనియర్‌ కల్నల్‌ ఝాంగ్‌ షూయిలీ వెల్లడించారు. భారత్‌ అతడిని త్వరగా విడిచిపెడుతుందని ఆకాంక్షించారు. 


అయితే.. సైనిక లాంఛనాలు పూర్తయ్యాయక.. చుషూల్‌-మోల్దో సరిహద్దు వద్ద వాంగ్‌ను వదిలిపెడతామని భారత అధికారులు తెలిపారు. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, భారత నౌకాదళం నిర్వహించే మలబార్‌ డ్రిల్‌లో ఆస్ర్టేలియా పాల్గొంటున్న నేపథ్యంలో.. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జోవ్‌ లిజియన్‌ వెల్లడించారు. భారత్‌, అమెరికా, జపాన్‌ సంయుక్తంగా నిర్వహించే ఈ డ్రిల్‌లో ఈ సారి ఆస్ర్టేలియా కూడా పాల్గొననున్నట్లు భారత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై లిజియన్‌ స్పందిస్తూ.. ఇలాంటి డ్రిల్స్‌ ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-10-21T09:20:39+05:30 IST