వేరుశనగ ధర రూ.6106

ABN , First Publish Date - 2022-01-26T06:43:06+05:30 IST

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు యాసంగి సీజన్‌ వేరుశనగ దిగుబడి రాక ప్రారంభమైంది. మార్కెట్‌లో మద్దతుకు మించిన ధర లభిస్తుండటంతో రైతులు పంటను తీసుకువస్తున్నారు.

వేరుశనగ ధర రూ.6106
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కు వచ్చిన వేరుసెనగ రాశులు

సూర్యాపేట సిటీ, జనవరి 25: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు యాసంగి సీజన్‌ వేరుశనగ దిగుబడి రాక ప్రారంభమైంది. మార్కెట్‌లో మద్దతుకు మించిన ధర లభిస్తుండటంతో రైతులు పంటను తీసుకువస్తున్నారు. సాధారణ మద్దతు ధర క్విం టాకు రూ. 5,550కాగా, సూర్యాపేట మార్కెట్‌లో మంగళవారం రూ. 6,106మద్దతు ధర లభించింది. ఈ నెల 3వ తేదీనుంచి మార్కెట్‌కు యాసంగి సీజన్‌ వేరుశనగ పంటను రైతులు తీసుకువస్తున్నారు. ప్రారంభంలో ధర క్వింటాకు రూ.3వేల నుంచి రూ.5వేల మధ్య లభించింది. రోజు రోజుకూ మార్కెట్‌కు వేరుశనగ పంట వస్తుండ టంతో వ్యాపారులు ధర పెంచుతున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 25వ వరకు మార్కెట్‌కు 125క్వింటాళ్ల వేరుశనగ వచ్చిందని మార్కెట్‌ కార్యదర్శి ఫసియుద్దీన్‌ తెలి పారు. వేరుశనగ సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో మంచి ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో నూతన్‌కల్‌, మద్దిరాల,నాగారం, పెన్‌పహాడ్‌, చివ్వెంల, మోతె, నాగారం, తిరుమలగిరి, ఆత్మకూర్‌(ఎస్‌) మండలాల్లో అత్యధికంగా వేరుశనగా సాగుకాగా, పేటలో మంచి ధర లభిస్తుండటంతో దిగుబడిని రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు.

ఈ నెల 3వ తేదీ నుంచి ధర ఇలా..

తేదీ క్వింటాళ్లు గరిష్ఠ ధర కనిష్ఠ ధర

3న 6 3,089 3,089

4న 8 5,159 4,059

6న 3 2,673 2,673

8న 15 4,556 4,156

10న 10 4,824 4,089

13న 2 4,396 4,396

19న 4 4,869 3,166

21న 26 4,513 3,513

24న 30 6,039 2,406

25న 21 6,106 5,016

Updated Date - 2022-01-26T06:43:06+05:30 IST