Abn logo
Apr 19 2021 @ 00:02AM

మహిళపై గొడ్డలితో దాడి

పెద్దకడబూరు, ఏప్రిల్‌ 18: మండలంలోని గంగులపాడు గ్రామంలో ఓ వ్యక్తి బంగారు ఆఽభరణాల కోసం మహిళపై ఆదివారం గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.  కుటుంబ సభ్యలు తెలిపిన మేరకు.. గంగులపాడు గ్రామానికి చెందిన ముల్లా ఉసేని బీ అనే మహిళ సాయంత్రం కట్టెల కోసం వెళ్లింది. మహిళ ఒంటరిగా కనిపించడంతో అదే గ్రామానికి చెందిన గౌస్‌ పీర్‌ మహిళ ధరించిన బంగారు ఆభరణాలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొడ్డలితో, విచక్షణా రహితంగా దాడి చేయడంతో త.ల, గడ్డంపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి కేకలు విన్న గ్రామస్థులు గౌస్‌ పీర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యడు. భాధితురాలిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement