Abn logo
May 11 2021 @ 08:12AM

పుట్ట మధును ఇంటికి పంపిన పోలీసులు

పెద్దపల్లి: వామన్‌‌రావు  దంపతుల హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌ను గత అర్ధరాత్రి సమయంలో రామగుండం పోలీస్ కమిషనరేట్  పోలీసులు ఇంటికి పంపారు. మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు విచారించిన అనంతరం ఆయనను ఇంటికి పంపారు. తిరిగి విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా కమిషనరేట్‌కు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. ప్రధానంగా వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుట్ట మధును పోలీసులు విచారించారు. 2 కోట్ల వ్యవహారంలో స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. 12 బ్యాంకుల నుండి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

Advertisement