పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-05T03:45:12+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కోరాడ రాజబాబు విమర్శించారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
ఏఓకు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ కోర్‌కమిటీ నాయకులు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన 


పద్మనాభం, డిసెంబరు 4:  గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కోరాడ రాజబాబు విమర్శించారు. మండలంలో రూ.4కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ మండల పరిషత్తు కార్యాలయం ఎదుట శుక్రవారం జరిపిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ రూ.లక్షలు అప్పు చేసి మూడేళ్ల క్రితం  చేపట్టిన పనుల బిల్లులు చెల్లించకుండా, ప్రస్తుత పనులకు బిల్లులు ఇస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా అనంత పద్మనాభుని గిరికి ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేకపోయిన నేతలు, గీతం కళాశాల, మాజీమేయర్‌ సబ్బం హరి ఇళ్లను కూల్చి కక్షపూరితంగా వ్యవహరిస్తూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

అంతకుముందు ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. మండల పరిపాలనాధికారి పి.రాధకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు, టీడీపీ సీనియర్‌ నాయకులు పాసర్లప్రసాద్‌,  జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కె.దామోదరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కె.నగేష్‌కుమార్‌, మాజీ ఎంపీపీ కె.లీలావతి, నేతలు శ్రీరామమూర్తి, కె.రమణ, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:45:12+05:30 IST