పెండింగ్‌ కేసులు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2022-09-04T07:36:38+05:30 IST

మద్యంమత్తులో వాహనాలు నడిపిన కేసులు సత్వరం పరిష్కరిస్తామని జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ అన్నారు.

పెండింగ్‌ కేసులు పరిష్కరిస్తాం
మాట్లాడుతున్న న్యాయమూర్తి అజయ్‌కుమార్‌

జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌

నిర్మల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 3 : మద్యంమత్తులో వాహనాలు నడిపిన కేసులు సత్వరం పరిష్కరిస్తామని జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ అన్నారు. ఆయన శనివారం మండల న్యాయసేవాసంస్థ, పోలీసుశాఖ సంయుక్తంగా ఏర్పా టు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు హాజరై మాట్లాడుతూ... ట్రాఫిక్‌ నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించారు. నిర్మల్‌ కోర్టులో వెయ్యి కేసులు మద్యం మత్తు లో నడిపిన కేసులున్నాయని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు ఇప్పటి నుండి పది వేల రూపాయల జరిమానా లేదా జైలుశిక్ష అమలవుతుందని తెలిపారు. వాహన చోదకులు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి వాహనానికి బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని, మూడో వ్యక్తికైనా బీమా ఉం డాలని స్పష్టం చేశారు. పార్కింగ్‌ స్థలాల్లోనే వాహనాలు నిలపాలని, ప్రజలకు ఇ బ్బందులు కలిగించవద్దని అన్నారు. న్యాయసేవా, వాహనప్రమాద, టౌన్‌ న్యూ సెన్స్‌ చట్టాలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, న్యాయవాదులు  ట్రాఫిక్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-04T07:36:38+05:30 IST