పింఛన్‌ పెంపు ఏదీ

ABN , First Publish Date - 2021-08-02T05:44:29+05:30 IST

పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి మాట తప్పారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. 2020 డిసెంబర్‌ 3న అసెంబ్లీ సాక్షిగా పింఛన్‌ సొమ్ము మొత్తాన్ని ఏటా జూలై 8వతేదీన రూ.250 పెంచుతామని ఆర్భాటంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కానీ రెండేళ్లుగా పింఛన్‌ పెంచిన దాఖలాలు లేవన్నారు.

పింఛన్‌ పెంపు ఏదీ
కొండపి ఎమ్మెల్యే స్వామి

మాట తప్పడం అలవాటుగా 

మార్చుకున్న జగన్‌

కొండపి ఎమ్మెల్యే స్వామి 

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 1 : పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి మాట తప్పారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. 2020 డిసెంబర్‌ 3న అసెంబ్లీ సాక్షిగా పింఛన్‌ సొమ్ము మొత్తాన్ని ఏటా జూలై 8వతేదీన రూ.250 పెంచుతామని ఆర్భాటంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కానీ రెండేళ్లుగా పింఛన్‌ పెంచిన దాఖలాలు లేవన్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంగా కొందరిపై కక్షగట్టి  కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయకపోగా,  ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారిని కూడా ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని అన్నారు. ఇలా మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌ అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ మొత్తాన్ని రూ.2500కు పెంచాలని డిమాండ్‌ చేశారు.  

 

Updated Date - 2021-08-02T05:44:29+05:30 IST