విద్యార్థుల ముందే బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-29T00:38:02+05:30 IST

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి స్థానం ఉంటుంది. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నతంగా తీర్చిదిద్దాల్చిన బాధ్యత..

విద్యార్థుల ముందే బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి స్థానం ఉంటుంది. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నతంగా తీర్చిదిద్దాల్చిన బాధ్యత వారిపై ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే చాలా మంది మెరుగైన విద్యనందిస్తూ.. అందరితో ప్రశంసలు అందుకుంటుంటారు. అలాగే కొంతమంది తమ వృత్తికే కలంకం తెస్తుంటారు. కొందరు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటే.. మరికొందరు చిన్న చిన్న తప్పులకు కూడా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మిజోరాంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 


మిజోరాంలోని (Mizoram) లుంగ్లీ జిల్లా పరిధిలోని గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో (Government school) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 22న బాలికపై తోటి విద్యార్థి దాడి చేశాడు. దీంతో బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి తెలియజేసింది. దీంతో ఆమె కోపంగా పాఠశాలకు వెళ్లి దాడి చేసిన బాలుడిని మందలించి ఇంటికి వచ్చింది. అయితే బాలుడిని మందలించిన విషయం తెలుసుకున్న టీచర్.. బాలిక తల్లికి ఫోన్ చేసి, తమకు తెలీకుండా ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Viral Video: నడుస్తూ వెళ్తున్న యువతి ఫోన్‌ను లాక్కెళ్లిన దొంగ.. చివరకు అతన్ని పట్టుకుని చూడగా..


ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో బాలిక తల్లి మళ్లీ పాఠశాలకు వెళ్లింది. తన కూతురిని ఇంటికి తీసుకెళ్తానంటూ చెప్పింది. అయితే స్కూల్ యూనిఫాం విప్పేసి తీసుకెళ్లాలంటూ టీచర్ కండీషన్ పెట్టింది. అంతటితో ఆగకుండా విద్యార్థుల ఎదుటే బాలిక యూనిఫాంను విప్పించింది. చివరకు అర్ధనగ్నంగా ఉన్న కూతురిని ఇంటికి తీసుకొచ్చింది. జరిగిన దారుణంపై తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

tragic incident: తాగుతూ తూలుతూ ఇంటికొచ్చిన భర్త.. అర్ధరాత్రవుతున్నా పదే పదే ఒకే విషయంలో భార్య వ్యతిరేకిస్తుండడంతో.. చివరకు..



Updated Date - 2022-08-29T00:38:02+05:30 IST