Abn logo
Oct 30 2020 @ 14:59PM

ప్రజలు దేవుళ్లు.. నేను పూజారిని: ఎంపీ సీఎం చౌహాన్

Kaakateeya

భోపాల్: ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్లని, ఆ దేవుళ్లకు తాను పూజారినని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అందుకే తాను ప్రజలకు సున్నా శాతం (0%) వడ్డీకి రుణాలు ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జౌరాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు.


‘‘నా వరకు ప్రజలే దేవుళ్లు. నేను పూజారిని. దేవుళ్లను ఎలా పూజిస్తామో నేను ప్రజలను అలాగే పూజిస్తాను. ప్రజల బాగు కోసం పని చేయడం నా కర్తవ్యం. అందుకే వారికి సున్నా శాతం వడ్డీకే రుణాలు ఇచ్చాను. కానీ, సేట్ కమల్‌నాథ్ (మాజీ ముఖ్యమంత్రి) రైతులను దోచుకున్నారు. 18 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు’’ అని చౌహాన్ అన్నారు.


మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న అన్ని స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement